సివిల్ సర్వీసెస్ తెలుగు సాహిత్యం మెయిన్స్  సిలబస్- తెలుగు. 

పేపర్ -I  (పార్ట్-ఎ)

 1.  ద్రావిడ భాషలలో తెలుగుకు గల స్థానం, దాని ప్రత్యేకత . ఆంధ్రము, తెలుగు , తెనుగు పదాల వ్యుత్పత్తి చరిత్ర. 

2.  మూల ద్రావిడం నుండి ప్రాచీనాంధ్రానికీ,  ప్రాచీనాంధ్రం నుండి ఆధునికాంధ్రానికీ ధ్వని, వర్ణ, పదాంశ , వ్యాకరణ వాక్య నిర్మాణ స్థాయుల్లో జరిగిన ముఖ్యమైన మార్పులు. 

3. గ్రాంథికమైన తెలుగుతో పోలిస్తే వ్యావహారికమైన తెలుగు చరిత్ర, తెలుగు భాష పట్ల నియత, ప్రకార్య దృష్టి కోణాలు. 

4. తెలుగు భాషపై  ఇతర భాషల ప్రభావం, దాని ఫలితాలు. 

5. తెలుగు భాష ఆధునికీకరణ: తెలుగు భాష ఆధునికీకరణలో భాషా సాహిత్య ఉద్యమాల పాత్ర. 

 తెలుగు భాష ఆధునికీకరణలో ( వార్తా  పత్రికలు, రేడియో, టీవీ మొ. ) ప్రసార మాధ్యమాల పాత్ర.  

పారిభాషిక పదాల సమస్య, వైజ్ఞానిక, సాంకేతిక వ్యవహారాలతో సహా వివిధ వ్యవహార భేదాల్లో నూతన పదకల్పన విధానాలు. 

6. తెలుగు మాండలికాలు: ప్రాంతీయ, సామాజిక భేదాలు, ప్రమాణీకరణ సమస్యలు. 

7. వాక్య నిర్మాణం: తెలుగు వాక్యం-ప్రధాన భేదాలు. సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట వాక్యాలు. నామాఖ్యాన, క్రియాఖ్యానాలు. ప్రత్యక్ష, పరోక్ష అనుకరణం. పరివర్తన పద్ధతులు. 

8. అనువాదం, అనువాద సమస్యలు: సాంస్కృతిక, సామాజిక, నుడికారపు సమస్యలు. అనువాద పద్ధతులు, అనువాద మార్గాలు, సాహిత్యక తదితర అనువాద భేదాలు, అనువాదం-వివిధ ప్రయోజనాలు.  

 

(పార్ట్-బి ) 

1. ప్రాజ్ఞన్నయ యుగ సాహిత్యం, మార్గ, దేశీ కవిత్వాలు

2. నన్నయయుగ సాహిత్యం. ఆంధ్ర మహా భారత రచనకు చారిత్రక, సాహిత్యక నేపథ్యం. 

3. శైవ కవులు, వారి పాత్ర. ద్విపద, శతకం,రగడ, ఉదాహరణ. 

4. తిక్కన- తెలుగు సాహిత్యంలో అతని స్థానం. 

5. ఎఱ్ఱన- అతని రచనలు. నాచన సోమన- అతని నవీన గుణసనాతత్వం. 

6. శ్రీనాథుడు, పోతన- వారి రచనలు, పాత్ర. 

7. తెలుగు  సాహిత్యంలో భక్తి కవులు- తాళ్లపాక  అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య. 

8. ప్రబంధాల వికాసం- కావ్యము, ప్రబంధం. 

9.  దక్షిణాంధ్ర యుగ సాహిత్యం- రఘునాథ నాయకుడు, చేమకూర వేంకటకవి, కవయిత్రులు, యక్షగానం, వచన, వాఙ్మయం, పద కవిత్వం లాంటి సాహిత్యరూపాలు. 

10. ఆధునిక తెలుగు సాహిత్యం- సాహిత్య రూపాలు.  నవల, కథానిక, నాటకం, నాటిక, కవిత్వరూపాలు.  

11. సాహిత్య ఉద్యమాలు: సంస్కరణ, జాతీయ, నవ్య సాంప్రదాయ, కాల్పనిక, అభ్యుదయ, విప్లవ ఉద్యమాలు. 

12. దిగంబర కవులు, స్త్రీవాద, దళితవాద సాహిత్యాలు. 

13. జానపద సాహిత్యం- ప్రధాన భేదాలు, జానపద ప్రదర్శన కళలు.